ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే
ప్రస్తుత రోజుల్లో చాలా మంది బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాల కంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు.
By అంజి Published on 16 July 2024 9:34 AM GMTఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే
ప్రస్తుత రోజుల్లో చాలా మంది బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాల కంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. అది చిన్నదైనా, పెద్దదైనా బిజినెస్ బెస్ట్ అని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో పెద్ద మొత్తంలో వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు కొన్ని బిజినెస్ టిప్స్ పాటించడంతో పాటు కొన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఎలాంటి బిజినెస్ ఎంచుకోవాలి?
బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దానిలో వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోండి. మీకు మంచి నాలెడ్జ్ ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు అనుకున్న దిశగా అడుగులు వేసి విజయం సాధించగలరు.
మార్కెట్‌లో పోటీదారులు
వ్యాపారం పెట్టాలనుకునేవారు కచ్చితంగా మార్కెట్‌లో తమ పోటీ దారుల గురించి తెలుసుకోవాలి. తక్కువ పోటీదారులు ఉన్న రంగాన్ని ఎంచుకుంటే నష్టాలు వచ్చే శాతం తక్కువ. అందుకే అడుగు వేసే ముందు బాగా ఆలోచించుకోవాలి.
ఓపిక అవసరం
వ్యాపారం స్టార్ట్ చేయగానే లాభాలు వస్తాయని ఊహించుకోవడం మానుకోవాలి. బిజినెస్ లాభాల బాట నడవాలంటే సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. వ్యాపారం చేయాలంటే అన్నిటిని భరించే ఓపిక ఉండాలి.
వ్యాపార విస్తరణ
బిజినెస్ స్టార్ చేసి.. లాభాలు గడిస్తున్నప్పుడు తమ వ్యాపారాన్ని వినియోగదారులకు తగ్గట్టుగా విస్తరించాలి. వినియోగదారులకు అవసరమైన సరుకును అందించే వెసులుబాటును ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి.