వీసా Vs రూపే.. ఏ డెబిట్‌ కార్డ్‌ తీసుకుంటే బెటర్‌?

మన దేశంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. ఎక్కువ శాతం మంది కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

By అంజి  Published on  1 Jan 2025 12:54 PM IST
Visa Card,  Rupay Card, Debit Card, Bank

వీసా Vs రూపే.. ఏ డెబిట్‌ కార్డ్‌ తీసుకుంటే బెటర్‌?

మన దేశంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. ఎక్కువ శాతం మంది కార్డుల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే చాలా మంది ఈ డెబిట్‌ కార్డులను వినియోగిస్తారే తప్ప తమ కార్డుపై వీసా, మాస్టర్‌ లేదా రూపే అని రాసి ఉన్నదాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, వీటి మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రూపే కార్డు

ఈ కార్డును నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ 2012లో ప్రారంభించింది. ఇదే భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్‌ కార్డ్‌ పేమెంట్‌ నెట్‌వర్క్. రూపే కార్డుతో అంతర్జాతీయ ట్రాన్సాక్షన్లు నిర్వహించలేరు. ఈ కార్డు ద్వారా జరిగే ప్రతి లావాదేవీ భారతదేశంలోనే ప్రాసెస్‌ అవుతుంది. కాబట్టి ఇతర కార్డ్‌ నెట్‌వర్క్‌లతో పోలిస్తే రూపే కార్డులపై లావాదేవీల ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. రూపే కార్డు లావాదేవీ వేగం ఎక్కువగా ఉంటుంది.

వీసా కార్డు

ఇది యూఎస్‌ ఆధారిత అంతర్జాతీయ డెబిట్‌ కార్డు. ఈ కార్డుతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో చెల్లింపులు చేయవచ్చు. రూపే కార్డ్‌తో పోలిస్తే వీసా కార్డుకు లావాదేవీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఇది అంతర్జాతీయ చెల్లింపు నెట్‌వర్క్‌ కాబట్టి లావాదేవీ ప్రక్రియ దేశం వెలుపల జరుగుతుంది. అందుకే లావాదేవీల వేగం తక్కువగా ఉంటుంది.

ఏది బెటర్‌?

రూపే, వీసా కార్డులలో ఏ కార్డు ఉత్తమం అనే విషయానికి వస్తే.. అది వినియోగదారుని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీరు విదేశాల్లో కూడా డెబిట్‌ కార్డును ఉపయోగించుకోవాలంటే.. వీసా కార్డు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే రూపే కార్డు కేవలం మన దేశంలో మాత్రమే పని చేస్తుంది. వీసా కార్డును ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఇక అంతర్జాతీయ లావాదేవీలు అవసరం లేదు అనుకునేవారు రూపే కార్డును తీసుకోండి. ఎందుకంటే దీని ట్రాన్షాక్షన్‌ ఫీజు తక్కువగా ఉంటుంది. అలాగే లావా దేవీ వేగం కూడా వీసా కార్డుతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది.

Next Story