ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్‌ ఈవెన్‌ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్

భారత్‌కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను రాబట్టింది.

By -  అంజి
Published on : 30 Sept 2025 12:57 PM IST

VerSe Innovation, Revenue Growth, EBITDA , Dailyhunt, Business

ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్‌ ఈవెన్‌ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్

భారత్‌కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను రాబట్టింది. బలమైన ఆర్థిక, కార్యాచరణ పనితీరుతో ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2025ని ముగించింది. కంపెనీ వ్యయ నియంత్రణలోనూ మంచి ఫలితాలు సాధించింది. ఈ కంపెనీ EBITDA బర్న్‌లో 20% తగ్గింపుతో పాటు, సంవత్సరానికి 88 శాతం బలమైన ఆదాయ వృద్ధిని సాధించింది. ఈ వృద్ధి లాభదాయకమైన, స్థిరమైన స్థాయికి పునాది వేయడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత వేగవంతం చేసింది.

ఏకంగా 88 శాతం ఆదాయ వృద్ధి

ఈ అద్భుతమైన ఫలితాలతో వెర్సే ఇన్నోవేషన్ ఇప్పుడు మరింతగా విస్తరించనుంది. 2024-25 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో చేపట్టిన వివిధ ఈవెంట్ల వచ్చే ఆదాయం రూ.1,029 కోట్ల నుంచి రూ.1,930 కోట్లకు పెరిగింది. మొత్తంగా 88 శాతం పెరిగింది. దీంతో కంపెనీ ఆదాయం 64 శాతం పెరిగి రూ. 2,071 కోట్లకు చేరింది. ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడంతో.. గతంలో కంపెనీ మార్జిన్ 89 శాతం ఉండగా, ఇప్పుడు 38 శాతానికి వచ్చింది.

రాబోయే ఆర్థిక ఏడాదిలో బ్రేక్‌ ఈవెన్‌ లక్ష్యంగా..

కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచింది. దీంతో కార్యకలాపాల ఆదాయంలో సేవల ఖర్చు 112 శాతం నుంచి 77 శాతానికి తగ్గింది. లాభార్జన దిశగా పయనిస్తోన్న వెర్సే ఇన్నోవేషన్‌.. 2025-26 ఆర్థిక సంవత్సరం సెకండ్‌ ఆఫ్‌లో గ్రూప్ స్థాయిలో బ్రేక్-ఈవెన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మరిన్ని లాభాలు రాబట్టుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం వెర్సే ఇన్నో వేషన్‌ కంపెనీ తన లాభాలను పెంచడానికి నాలుగు ముఖ్యమైన స్ట్రాటజీలను అనుసరిస్తోంది.

భవిష్యత్‌ లక్ష్యాలు

NexVerse.ai అనే తన AI-ఆధారిత యాడ్-టెక్ ఇంజిన్‌తో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి వెర్సే ఇన్నోవేషన్‌ ప్రయత్నిస్తోంది. అలాగే యాడ్లు ఇచ్చే వారికి మరింత బెటర్‌ రిజల్ట్‌ ఇవ్వాలని చూస్తోంది. డైలీహంట్ ప్రీమియం సర్వీస్‌ను మరింత విస్తరించాలని చూస్తోంది. దీని ద్వారా డబ్బు చెల్లించి స్పెషల్‌ కంటెంట్‌ కొనుక్కునేలా చేసి ఆన్‌లైన్‌ పాఠకులను ఆకర్షించాలని భావిస్తోంది. అలాగే జోష్ యాప్‌లో ఆడియో కాలింగ్ ఫెసిలిటీతో క్రియేటర్‌లు, యూజర్‌ల మధ్య సంబంధాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. వెర్సే కొల్లాబ్ ద్వారా క్రియేటర్ క్యాంపెయిన్‌లను చేయాలని చూస్తోంది. అలాగే తమ వశం చేసుకున్న మాగ్జ్టర్, వాల్యూలీఫ్ వంటి సంస్థలను తమ బిజినెస్‌ మెయిన్‌ స్ట్రీమ్‌ ద్వారా సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా వ్యాపార సేవలు, కన్స్యూమర్ విభాగాలలో లాభాలను ఆర్జించుకోవాలని వెర్సే ఇన్నోవేషన్‌ చూస్తోంది.

Next Story