డ‌వ్ షాంపూలు వాడుతున్నారా..? క్యాన్స‌ర్ కార‌ణ కెమిక‌ల్స్ ఉన్నాయ‌ట‌.. రీకాల్‌

Unilever Recalls Dove Other Dry Shampoos Over Cancer Risk.యూనిలీవ‌ర్ లిమిటెడ్ సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న షాంపులను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Oct 2022 5:43 AM GMT
డ‌వ్ షాంపూలు వాడుతున్నారా..?  క్యాన్స‌ర్ కార‌ణ కెమిక‌ల్స్ ఉన్నాయ‌ట‌.. రీకాల్‌

యూనిలీవ‌ర్ లిమిటెడ్ సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న షాంపులను వాడుతున్నారా..? అయితే మీకో ప్ర‌మాద హెచ్చ‌రిక‌. తాము ఉత్ప‌త్పి చేస్తున్న షాంపూల్లో క్యాన్స‌ర్ కార‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించిన‌ట్లు ఆ కంపెనీ తెలిపింది. వెంట‌నే ఆయా ఉత్ప‌త్పుల‌ను రికాల్ (వెన‌క్కి తీసుకోవ‌డం) చేస్తున్న‌ట్లు పేర్కొంది. యూనిలీవ‌ర్ లీకాల్ చేసిన షాంపు బ్రాండుల జాబితాలో డ‌వ్‌తో పాటు నెక్స‌స్‌, సునావే, ట్రెస్‌మే, టిగి వంటివి ఉన్నాయి. 2021 అక్టోబ‌ర్‌కి ముందు త‌యారైన షాంపూల్లోనే ఈ హానిక‌ర కార‌ణాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

ఈ మేరకు సంబంధిత వివరాలతో అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) తాజాగా తన వైబ్‌సైట్‌లో ఓ నోటీసు పోస్టు చేసింది. ఈ షాంపూలలో బెంజీన్ అనే క్యాన్సర్‌కు కారకమయ్యే కెమికల్ ఉన్నట్టు పేర్కొంది. వీటి వాడ‌కంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవ‌కాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్ప‌త్తులు అన్నింటినీ రీకాల్ చేశామ‌ని, ఆయా ఉత్ప‌త్తులను షెల్ప్ ల నుండి తీసివేయాల‌ని రిటైల‌ర్ల‌ను కోరిన‌ట్లు కంపెనీ తెలిపింది.

"ఏరోసోల్ డ్రై షాంపూలు వంటి ఇతర కన్జూమర్ ప్రొడక్టు కేటగిరీల్లో అత్యధికంగా బెంజీన్ కారకం ఉండటం దురదృష్టకరం. మేము దీనిపై క్రియాశీలకంగా విచారణ చేపడుతున్నాం'' వాలీసూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ చెప్పారు.

Next Story