సెంచరీకి చేరువలో టమాటా ధర.!
కిలో టమాటా మార్కెట్లలో ధర రూ.100 దాటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
By Kalasani Durgapraveen Published on 7 Oct 2024 4:56 PM IST
కిలో టమాటా మార్కెట్లలో ధర రూ.100 దాటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల టమాటా ధరలు పెరగడానికి అకాల వర్షాలే కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని వ్యవసాయ ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడం కూడా కారణంగా చెబుతున్నారు. పలు మార్కెట్లలో కిలో రూ.100కు పైగా అమ్ముతున్నారు. అకాల వర్షాలు, వైరస్ దాడితో మహారాష్ట్ర చుట్టుపక్కల కీలక వ్యవసాయ ప్రాంతాల్లో టమోటా పంట దెబ్బతింది. దీంతో సరఫరా తగ్గి వారం రోజుల్లోనే ధరలు పెరిగాయి. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి, కేవలం నాలుగింట ఒక వంతు దిగుబడి మాత్రమే ఆదా కావడంతో.. ధరలు వారంలో రెట్టింపు అయ్యాయి. గత సీజన్ లో సరైన రాబడులు రాకపోవడంతో రైతులు ఈ ఏడాది ఇప్పటికే టమాటా సాగును తగ్గించారు. అదీకాక వర్షాలు కురవడంతో సరఫరా మరింత కుంటుపడింది. ధరల పెంపుతో కొంత మంది రైతులు లాభపడగా.. మరికొందరు భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంతో నష్టపోయారు. టమేటా సాగుతో కొంతమంది రైతులు లాభపడుతుంటే.. మరికొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. సామాన్యుడు కూడా ధర పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు.