కరోనా సెకండ్ వేవ్ అనంతరం పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది. శనివారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.400 మేర తగ్గింది. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధర తగ్గుదల్లో వ్యత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,570, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,530
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,240, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,240
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.