దూసుకుపోతున్న బంగారం ధరలు
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 11 Feb 2025 9:49 AM IST
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రజలు బంగారం, వెండి ధరలలో మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. మంగళవారం కూడా బంగారం, వెండి ధరలలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈరోజు బంగారం 24 క్యారెట్ల ధర రూ. 88,080 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 80,750గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,02,500 పలుకుతోంది.
బంగారం, వెండి ధరలు నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి. ఎందుకంటే డిమాండ్, సరఫరా, ప్రపంచ మార్కెట్ ప్రభావం వంటి అనేక అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి. బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా గడిచిన నాలుగు సెషన్లు స్టాక్ మార్కెట్లో నమోదు అవుతున్న నష్టాలు అనే చెప్పవచ్చు. దీనికి తోడు అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 2900 డాలర్లపైకి చేరుకుంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంగా నష్టపోతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ తులం రూ. 79,810 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములు రూ. 87,060 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 80,750 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర తులం రూ. 88,080 కి చేరింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కిలోకు రూ. 99,500 వద్ద ఉండగా.. హైదరాబాద్ మార్కెట్లో రూ. 1.07 లక్షల వద్ద ఉంది.