ప్రపంచ కుబేరుల్లోకి టిక్ టాక్ యజమాని
TikTok founder Zhang Yiming in world billioneers. టిక్ టాక్వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ ప్రపంచంలో అత్యంత కుబేరులలో ఒకరు అయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on 15 April 2021 9:10 AM ISTప్రపంచంలోనే అత్యంత పాప్యులర్ అయిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ అన్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది భారత్ తో సహా కొన్ని దేశాలు వినియోగదారుల గోప్యతకు ఉల్లంఘిస్తున్నాయంటూ టిక్‌టాక్‌తో సహా కొన్ని యాప్‌లను నిషేధించాయి. దీంతో టిక్ టాక్ పని అయిపోయింది అనుకున్నారు. టిక్ టాక్ యాప్ ను తయారు చేసిన కంపెనీ బైట్ డాన్స్ వాల్యూ పడిపోయిందని భావించారు.. కానీ అలా జరగలేదు. ఈ యాప్‌నుకు స్థాపించిన జాంగ్ యిమింగ్ ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించాడు. అగ్ర దేశాలు పగపట్టినా, ఆంక్షలు విధించినా తట్టుకుని, తన కంపెనీ ని విజయ తీరాల వైపు నడిపించడంలో జాంగ్ విజయవంతమయ్యాడు. అదే అతడిని అందలం ఎక్కించేలా చేసింది.
2012లో బైట్‌డాన్స్ యాప్‌తో మొట్టమొదటిసారిగా విజయాన్ని అందుకున్నారు జాంగ్. ఈ యాప్.. చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌లైన టిక్‌టాక్.. చైనీస్ ట్విన్ యాప్ డౌయిన్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్లుకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది. అయితే దీనికంటే ముందే ఈ యాప్.. న్యూస్ అగ్రిగేషన్‌కు మారింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తర్వాత.. పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడులను పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారట.
మొత్తానికి 38 ఏళ్ల వయసులోనే కుబేరుడు అయ్యాడు జాంగ్. మార్కెట్ వాల్యు ప్రకారం ఆయన బైట్ డ్యాన్స్ వాల్యూ 250 బిలియన్ డాలర్లకు చేరింది.. ఇందులో జాంగ్ కు దాదాపు 25 శాతం వాటా ఉంది.. అంటే దాదాపు 63 బిలియన్ డాలర్లు. సో ఇప్పుడు చైనాలో రిచ్చెస్ట్ బిలియనీర్లలో ఆయన కూడా చేరారు.