నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే..
నేటి నుంచి నవంబర్ నెల ప్రారంభం అయ్యింది. ప్రతి నెల లాగే ఈ నెలలో పలు నిబంధనలు మారాయి.
By అంజి Published on 1 Nov 2024 7:09 AM ISTనవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే..
నేటి నుంచి నవంబర్ నెల ప్రారంభం అయ్యింది. ప్రతి నెల లాగే ఈ నెలలో పలు నిబంధనలు మారాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. బ్యాకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నియమ, నిబంధనలు మారాయి. ఈ నిబంధనలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సామాన్యుడిపై ఈ నిబంధనలు చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. మారిన నిబంధనలు, మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ రూల్ అమలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ ఛానెల్‌లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ రూల్‌ను తీసుకొచ్చింది.
రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్
ఇప్పటి వరకు రైలు టికెట్లను 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది. అయితే ఈ ఫెసిలిటీని రైల్వే శాఖ 60 రోజులకు మాత్రమే తగ్గించాలని నిర్ణయించింది. దీంతో రైలు ప్రయాణానికి 60 రోజుల ముందు మాత్రమే టికెట్ బుకింగ్ చేయవచ్చు. ఇది ప్రయాణికులు తగిన సమయానికి ప్లానింగ్ చేసుకునేలా చేస్తుంది.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై ఫైనాన్స్ ఛార్జీలను పెంచింది. ఇప్పటి వరకు 3.5% ఉండే ఈ ఛార్జీలను నవంబర్ 1 నుండి 3.75% కి పెంచింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పై బకాయిలు ఉన్న వినియోగదారులు ఇప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.
ఐసీసీఐ క్రెడిట్ కార్డు
ఐసీసీఐ క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు జరిగాయి. నవంబర్ 15 నుండి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త మార్పులను వినియోగదారులు బాగా అర్థం చేసుకుని తమ ఖర్చులను సవ్యంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం.
ఇండియన్ బ్యాంక్ ఎఫ్డీ స్కీమ్ గడువు పెంపు
ఇండియన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది. దీనివల్ల వినియోగదారులు తమ డిపాజిట్‌లపై మరింత సమయం పాటు అధిక వడ్డీ రేట్లను పొందే ఛాన్స్ ఉంటుంది.