బీర్ ధర రూ.180/- మరి తయారీకి ఎంతో తెలుసా?
మద్యం ప్రియుల్లో బీర్ తాగేవారు అధికంగా ఉంటారు. ఒక్క బీర్ బాటిల్ కోసం కనీసం రూ.180 - రూ.200 ఖర్చు చేస్తారు. ఇంత వెచ్చించి..
By అంజి
బీర్ ధర రూ.180/- మరి తయారీకి ఎంతో తెలుసా?
మద్యం ప్రియుల్లో బీర్ తాగేవారు అధికంగా ఉంటారు. ఒక్క బీర్ బాటిల్ కోసం కనీసం రూ.180 - రూ.200 ఖర్చు చేస్తారు. ఇంత వెచ్చించి బీర్ కొంటున్నారు కదా? మరి దీని తయారీకి ఎంత ఖర్చు అవుతుందో మీరేప్పుడైనా ఆలోచించారా? అది ఇప్పుడు తెలుసుకుందాం..
మందు బాబులకు కిక్ కావాలి. ప్రభుత్వాలకు ఆదాయం కావాలి. అందుకు ఉన్న అతి పెద్ద ప్రత్యామ్నాయాల్లో మద్యం ఒకటి. అందుకే దీని రేటను ఎంత పెంచినా డ్రంకర్లు ఏమాత్రం నిరాశ చెందకుండా మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. మద్యం షాప్ వాడు ఒక బీర్ బాటిల్ రూ.180 అని చెప్పగానే ఎంతైనా పర్లేదని ఫోన్ పే చేస్తుంటారు. కానీ, ఇందులో 70 నుంచి 80 శాతం ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తుంది. మద్యం తయారీకి కేవలం రూ.30 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక్క బీర్ బాటిల్ తయారీకి అది వినియోగదారుడికి చేరడానికి మధ్య 350 శాతం పన్ను ఉంటుంది.
ఒక బీర్ బాటిల్ తయారీకి ఆ కంపెనీకి రూ.10 నుంచి రూ.15 వరకు మాత్రమే లాభం వస్తుంది. మద్యం ఉత్పత్తులు ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేవు. కాబట్టి దేశమంతటా మద్యం ధరలు ఒకేలా ఉండవు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టం ప్రకారం మద్యంపై పన్నులను విధిస్తాయి. దీన్నే ఎక్సైజ్ డ్యూటీ అని అంటారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ డ్యూటీ అనేది ఓ ప్రధాన ఆదాయ వనరు. అందువల్ల చాలా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యంపై అధిక పన్నులు విధిస్తాయి. ఎక్సైజ్ డ్యూటీతో పాటు సేల్స్ టాక్స్, వ్యాట్ వంటి పన్నులను కూడా విధిస్తాయి.