5 వేల మంది ఉద్యోగులపై టెక్ మహీంద్రా వేటు..!

Tech Mahindra to cut BPO staff by 5000 in FY21.ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 5 వేల మంది ఉద్యోగులపై వేటు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2021 5:55 AM GMT
Tech Mahindra to cut BPO staff by 5000 in FY21

ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆసంస్థ‌లో ప‌నిచేస్తున్న 5వేల మందిని 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉద్యోగాల్లోంచి తీసివేయ‌నుంది. ఆదాయాలు పెరుగుతున్న‌ప్ప‌టి కంపెనీ ఇలా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లక‌నుండ‌డం గ‌మ‌నార్హం. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ అమలులో నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంతో.. బిజినెస్ ప్రాసెస్ స‌ర్వీసెస్( బీపీఎస్‌) విభాగంలో ప‌నిచేస్తున్న 5వేల మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌ల‌కనుంది.

సెప్టెంబ‌ర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగినా.. ఇప్ప‌టికే 2500 మంది సిబ్బందిని తొల‌గించింది. ఇప్పుడు అంతకు రెండింతల మందిని తొలగించి, మొత్తం సిబ్బంది సంఖ్యను 38 వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఒక ఉద్యోగే.. సాంకేతిక‌త సాయంలో ప‌లు విధులు నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉన్నందున సంస్థ ఆదాయార్జ‌న‌కు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెర‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.

ఉత్పాదకతతో పాటు ఆదాయం పెరగడం కూడా ఈ నిర్ణయం వెనకున్న మరో కారణమని ఆ సంస్థ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండడం వల్ల కొన్ని అద్దె భవనాలను కూడా ఖాళీ చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఖాతాదారుల అవసరాల మేరకు 40 శాతం మంది ఉద్యోగులు మాత్రం కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.


Next Story