టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ లాంచ్‌తో సీఎన్‌జీ మార్కెట్‌లో సంచలనం

Tata Motors Creates A Sensation In The Cng Market With The Launch Of Altroz Icng. భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, భారత దేశ పు

By Medi Samrat  Published on  22 May 2023 11:30 AM GMT
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ లాంచ్‌తో సీఎన్‌జీ మార్కెట్‌లో సంచలనం

భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్, భారత దేశ పు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతతో కూడిన Altroz iCNGని రూ. 7.55 లక్షల (ఆల్-ఇండియా, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈరోజు మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. కొనుగోలుదారుల అవసరా లను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ పరిశ్రమ-మొదటి CNG సాంకేతికతను అభివృద్ధి చేసింది, AltroziCNG, ఇది బూట్ స్పేస్‌లో ఎటువంటి రాజీపడదు. కస్టమర్‌లు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అన్ని సౌకర్యాలు, విలాసాన్ని ఆస్వాదించేలా అందించేలా అత్యుత్తమ ఫీచర్లతో వస్తుంది.

Altroz iCNG వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్‌ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz iCNG అనేది వ్యక్తిగత విభాగంలో మూడవ CNG ఉత్పాదనగా ఉంది. కార్ల యువ కొనుగోలుదారులకు CNG ని చక్కని ప్రతిపాదనగా చేస్తూ, Altroz iCNG ప్రత్యేక లక్షణాలను ప్రచారం చేయడానికి కంపెనీ OMG! its CNG ని విడుదల చేసింది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబి లిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శైలేష్ చంద్ర ఇలా అన్నారు: “‘‘‘‘వినియోగదారులు ఆర్థిక పర్యావరణ అను కూల ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇంధనంగా సీఎన్జీ దాని విస్తృత లభ్యతతో ఎంతగానో ప్రజామోదం పొందింది. ఏదేమైనప్పటికీ, సీఎన్జీని ఎంచుకోవడం అంటే ఆశించదగిన లక్షణాలపై రాజీ పడడం, బూట్ స్పేస్‌ను గణనీయంగా వదులుకోవడం అనే భావన ఉంది. జన వరి 2022లో, మేం Tiago, Tigor లలో అధునాతన iCNG సాంకేతికతను ప్రారంభించడం ద్వారా మొదటి రాజీని పరిష్కరిం చాం, అత్యుత్తమ పనితీరు, అత్యుత్తమ ఫీచర్లను అందజేస్తున్నాం. ఈరోజు, సీఎన్జీ మార్కెట్‌ను పునర్నిర్వచించే విధంగా, బూట్ స్పేస్‌పై ఉన్న ప్రధాన ఆందోళనను పరిష్కరించడం ద్వారా పరిశ్రమలో మొదటి ఆఫర్ అయిన Altroz iCNGని ప్రారంభించడం పట్ల మేం సంతోషిస్తున్నాం. “

“Altroz iCNG అనేది కస్టమర్ అవసరం, మా ఇంజనీరింగ్ పరాక్రమంపై మా లోతైన అవగాహనకు నిదర్శనం. ట్విన్-సిలిండర్ సీఎన్జీ సాంకేతికత, అడ్వాన్స్ ఫీచర్ల పురోగతితో మేం మరింత వ్యక్తిగత సెగ్మెంట్ కొనుగోలు దారులు ఈ ఎంపికను గట్టిగా పరిగణించాలని ఆశిస్తున్నాం. మా మల్టీ-పవర్‌ట్రెయిన్ వ్యూహంతో, Altroz పోర్ట్‌ ఫోలియో ఇప్పుడు పెట్రోల్, డీజిల్, iturbo, iCNGని అందిస్తోంది, మేము కస్టమర్‌లకు ఎంచుకోవడానికి ఎంపికలను అందిస్తున్నాం. Altroz iCNG మా విస్తారమైన న్యూ ఫరెవర్ శ్రేణిని బలపరుస్తుంది, ప్యాసింజర్ కార్లలో మా వృద్ధి వేగాన్ని కొనసాగిస్తుంది“.

Altroz iCNG ఆరు రకాలైన XE, XM+, XM+(S), XZ, XZ+(S)మరియు XZ+O(S)లో అందించబడుతుంది, ఇది ఒపేరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. Altroz iCNG 3 సంవత్సరాలు / 100000 కిమీ ప్రామాణిక వారంటీతో యాజమాన్యం మొత్తం వ్యయాన్ని మరింత తగ్గిస్తుంది.


Next Story