ట్రేడ్‌ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు (T+1) సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ సెటిల్‌మెంట్ మారనుంది.

By అంజి  Published on  24 March 2024 10:33 AM IST
Sebi, Trade Settlement, Stock market

ట్రేడ్‌ చేసిన రోజే అకౌంట్లలోకి డబ్బులు

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేస్తే మరుసటి రోజు (T+1) సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ సెటిల్‌మెంట్ మారనుంది. ఇకపై ట్రేడ్‌ జరిగిన రోజే (T+0) సాయంత్రం 4.30 లోపు సెటిల్‌మెంట్‌ చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సిద్ధమవుతోంది. సెబీ ఈ సెటిల్‌మెంట్‌పై నమూనా పరీక్షలను నిర్వహించనుంది. ఈ నెల 28వ తేదీన కొత్త బీటా వెర్షన్‌ను ఆవిష్కరించనుంది. ఆరు నెలల పాటు కేవలం 25 షేర్లు, పరిమిత సంఖ్యలో బ్రోకర్లకు ఈ సదుపాయాన్ని పరీక్షిస్తుంది.

తద్వారా వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. 3, 6 నెలల చివర ఈ పరీక్షల ప్రగతిని సెబీ పరీక్షిస్తుంది. అన్ని కరెక్ట్‌గా జరిగితే విస్తృత స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది. చివరకు అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. టి+0 సెటిల్‌మెంట్‌ వల్ల బ్రోకర్ల సొంత నిధులను వాడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. టి+0 అమల్లోకి వస్తే..: సాయంత్రం 4:30 గంటలకల్లా బ్రోకర్లకు నిధులు జమవుతాయి. దీని వల్ల భారత స్టాక్‌ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది.

Next Story