ఆడపిల్లల పైచదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పొదుపు పథకం 'సుకన్య సమృద్ధి యోజన'. ఇతర పొదుపు పథకాల కన్నా ఎక్కువ వడ్డీ అందజేస్తుండటంతో ఈ స్కీమ్‌పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB ONE యాప్ ద్వారా బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే, కేవలం మొబైల్ లోనే సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ప్రాసెస్ ఇదిగో
- ముందుగా మీరు మీ ఫోన్‌లో PNB ONE యాప్ ఇన్ స్టాల్ చేసుకుని లాగిన్ కావాలి.
- మెయిన్ మెనూ నుంచి సర్వీసెస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత గవర్నమెంట్ ఇనీషియేటివ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- సుకన్య సమృద్ధి ఖాతా ఓపెనింగ్‌ను ఎంపిక చేసుకోవాలి.
- అక్కడ కనిపించే సూచనలు పాటిస్తూ, అడిగిన వివరాలు సమర్పిస్తూ ప్రక్రియ పూర్తి చేయాలి.