క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ కోసం గూగుల్ చేస్తున్నారా..?

State Bank Of India Alerts customers about fake customer care numbers.మ‌న‌కు ఏ సందేహాం వ‌చ్చినా, ఏదైనా స‌మాచారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2021 3:45 AM GMT
క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ కోసం గూగుల్ చేస్తున్నారా..?

మ‌న‌కు ఏ సందేహాం వ‌చ్చినా, ఏదైనా స‌మాచారం కావాల‌న్నా కూడా గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. ఇక బ్యాంకులు, ఈ కామ‌ర్స్ సంస్థ‌లకు సంబంధించిన స‌మాచారం కోసం ఆయా సంస్థ‌ల అధికారిక‌ వెబ్‌సైట్ల‌కు వెళ్ల‌కుండా గూగుల్ సెర్చ్‌లోనే ఆయా సంస్థ‌ల‌కు సంబంధించిన కాల్ సెంట‌ర్ల నెంబ‌ర్ల‌ను వెతుకుతుంటాం. దీన్ని కొద్ది మంది కేటుగాళ్లు అవ‌కాశంగా చేసుకుని ఫేక్ కాల్ సెంట‌ర్ల నెంబ‌ర్ల‌ను గూగుల్‌లో ఉంచుతున్నారు. వీటినే నిజం అని న‌మ్మి కొంద‌రు ఆ నెంబ‌ర్ల‌కు కాల్ చేసి న‌గ‌దు పొగొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల ఎక్కువ అవుతున్నాయి. దీనిపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌ను అల్ట‌ర్ చేస్తోంది.

ఫేక్‌(మోస‌పూరిత‌) క‌స్ట‌మ‌ర్ కేర్ సెంట‌ర్ల వ‌ల‌లో ప‌డి ఖాతాకు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను అందిస్తే.. ఖాతాలోని డ‌బ్బు పోగొట్టుకునే అవ‌కాశం ఉంద‌ని ఎస్‌బీఐ హెచ్చ‌రిస్తోంది. దీనిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ఫేక్ క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ల‌తో జాగ్ర‌త్త‌. స‌రైన క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌రు కోసం ద‌య‌చేసి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్ర‌దించండి. బ్యాంకింగ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను(పిన్‌, ఓటీటీ వంటి) వివ‌రాల‌ను ఎవ‌రితోనూ పంచుకోవ‌ద్దు అని ఖాతాదారుల‌ను హెచ్చ‌రించింది.

Next Story