గోల్డ్‌ లవర్స్‌కి షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా..

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి.

By అంజి  Published on  12 April 2024 11:20 AM IST
gold price, Business, silver, gold market

గోల్డ్‌ లవర్స్‌కి షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా.. 

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. బంగారం కొనుగోలుదారులు.. కొనేముందు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచడం మంచిది.

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల గోల్డ్‌ 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.67,200గా నమోదు అయ్యింది.

విజయవాడ, అలాగే హైదరాబాద్‌లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 6,720 గానూ, 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 67,200 గానూ ఉంది.

ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, విజయవాడలో ఒక గ్రాము ధర రూ. 7,331గా, 10 గ్రాముల బంగారం ధర రూ. 73,310 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,310 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.73,310 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,240.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..67,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,460 గా ఉంది.

మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి కూడా కిలో రూ.1500 పెరిగి రూ.90,000కు చేరింది. ముంబైలో 86,600, ఢిల్లీలో 86,600, బెంగుళూరు లో 85,100గా ఉంది.

Next Story