శుభవార్త.. తగ్గిన బంగారం ధర
September 8th Gold Price.పసిడి అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. అందుకనే బంగారాన్ని కొనేందుకు
By తోట వంశీ కుమార్ Published on 8 Sep 2021 1:43 AM GMTపసిడి అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. అందుకనే బంగారాన్ని కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకున్నంతగా మరేది అక్కరకు రాదు అని బావించడమే ఇందుకు కారణం. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల ధర రూ.48,440
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.