స్వల్పంగా పెరిగిన బంగారం ధర
September 6th Gold Price.భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు
By తోట వంశీ కుమార్ Published on 6 Sep 2021 1:38 AM GMTభారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. కాగా.. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు కూడా ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 మేర పెరిగింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,910
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,970, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,710
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,610
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.