మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

September 5th Gold Price.ప‌సిడి ప్రియుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sept 2021 7:36 AM IST
మ‌గువ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి ప్రియుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. బంగారం ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటాయి. ఓ రోజు త‌గ్గితే మ‌రో రోజు పెరుగుతూ ఉంటుంది. కాగా.. గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన ధ‌ర నేడు పెరిగింది. ఆదివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.300 మేర పెరిగింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉండ‌గా.. చాలా ప్రాంతాల్లో పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,500, 24 క్యారెట్ల ధర రూ.48,550

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story