దిగొస్తున్న పసిడి ధరలు
September 4th Gold price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2021 1:58 AM GMTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక అవసరాల్లో బంగారానికి మించి మరొకటి అక్కరకు రాదు అనేది దాని ఉద్దేశ్యం. ఇక బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర.. ఇటీవల కాస్త దిగి వచ్చింది. తాజాగా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ధర స్థిరంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,580
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల ధర రూ.48,220
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.