శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

September 3rd Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 1:49 AM GMT
శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. గ‌త కొద్దిరోజులుగా పెరిగిన ధ‌ర‌లు.. ఇటీవ‌ల స్వ‌ల్పంగా దిగివ‌స్తున్నాయి. తాజాగా దేశీయంగా ప‌ది గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.100 నుంచి 300 వ‌ర‌కు త‌గ్గింది. అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా తగ్గ‌దు. ఆయా ప్రాంతాల్లో ఉంటే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి బంగారం ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,580

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,280

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,230

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,230

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,200, 24 క్యారెట్ల ధర రూ.48,230

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story