బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..? ఏ ఏ న‌గ‌రాల్లో ఎంతంటే..?

September 2nd Gold Price.గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది. నేడు ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2021 1:37 AM GMT
బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..? ఏ ఏ న‌గ‌రాల్లో ఎంతంటే..?

గ‌త రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది. నేడు ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. గురువారం ధ‌ర‌ల్లో ఎటువంటి మార్పులు లేవు. ఇక ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్ప‌డింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,720

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300

- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల ధర రూ.48,330

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story