భారీగా తగ్గిన వెండి ధర.. బంగారం ఎంతంటే..?
September 26th Gold price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ
By తోట వంశీ కుమార్ Published on 26 Sep 2021 4:44 AM GMTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఇటీవల తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండు రోజులు తగ్గిన ధర.. నేడు స్థిరంగా ఉంది. ఆదివారం దేశీయంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కాగా.. క్రితం రోజుతో పోలిస్తే నేడు కిలో వెండి ధర రూ. 800 మేర తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 64,100లుగా ఉంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా వెండి ధర ఇదే విధంగా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,570, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,530
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,240, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,240
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 -హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.