మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
September 22nd Gold price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 22 Sep 2021 2:16 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధర తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు దిగిస్తున్నాయి. అయితే.. నేడు బంగారం ధర కాస్త పెరిగింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధర పై రూ.200మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,800 వద్ద కొనసాగుతుంది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర పడిపోయింది. రూ. 400 తగ్గింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.63,800 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,720
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,330, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,330
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,460
ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు