పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
September 21st Gold Price.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2021 2:12 AM GMTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇటీవల క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నేడు కూడా బంగారం ధర తగ్గింది. మంగళవారం దేశీయంగా 10గ్రాముల పసిడి ధరపై రూ.260 మేర తగ్గింది. ఆయా ప్రాంతాలను బట్టీ బంగారం ధర తగ్గుదలలో మార్పులు ఉంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,130, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,130గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,300, 24 క్యారెట్ల ధర రూ.47,230
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.