శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
September 1st Gold Price.పసిడి అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు
By తోట వంశీ కుమార్ Published on 1 Sep 2021 2:11 AM GMTపసిడి అంటే భారతీయులకు మక్కువ ఎక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. ఓరోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర కాస్త తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,680
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,720
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,500
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల ధర రూ.48,330
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.