బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..? ఏ ఏ న‌గ‌రాల్లో ఎంతంటే..?

September 19th Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sept 2021 7:07 AM IST
బంగారం ధ‌ర పెరిగిందా..? త‌గ్గిందా..? ఏ ఏ న‌గ‌రాల్లో ఎంతంటే..?

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. క‌రోనా సెకండ్ వేవ్ అనంత‌రం బంగారం ధ‌ర పెరుగుతూ పోయింది. అయితే.. ఇటీవ‌ల రెండు రోజుల నుంచి ప‌సిడి ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి. తాజాగా ఆదివారం బంగారం ధ‌ర స్థిరంగా ఉంది. ఈ రోజు దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర మార్కెట్‌లో రూ.45,390గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల ధర రూ.47,350

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story