మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

September 18th Gold price.మ‌నదేశంలో బంగారానికి పుల్ డిమాండ్ ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2021 7:40 AM IST
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

మ‌నదేశంలో బంగారానికి పుల్ డిమాండ్ ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌లు ఇటీవ‌ల క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం ధ‌ర త‌గ్గింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.600 మేర త‌గ్గింది. ఆయా ప్రాంతాల‌ను బ‌ట్టి ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల ఉంటుంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,710, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,690

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,400, 24 క్యారెట్ల ధర రూ.47,350

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story