దిగొస్తున్న పసిడి ధర
September 15th Gold price.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ సారి పెరిగితే..
By తోట వంశీ కుమార్ Published on 15 Sep 2021 1:46 AM GMTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ సారి పెరిగితే.. మరోసారి తగ్గుతూ ఉంటుంది. ఇక భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆసరాగా నిలుస్తుందని బావించడమే అందుకు కారణం. కరోనా సెకండ్ వేవ్ అనంతరం క్రమంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టాయి. బుధవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు