శుభవార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

September 14th Gold Price.ప‌సిడి ధ‌ర‌లు నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sep 2021 2:04 AM GMT
శుభవార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌లు నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటుంది. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌లు ఇటీవ‌ల క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. మంగ‌ళ‌వారం ప‌సిడి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.60 మేర త‌గ్గింది. ప్ర‌స్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,010గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,010, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల ధర రూ.47,990

ఇక బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story