ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
September 13th Gold Price.కరోనా సెకండ్ వేవ్ అనంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇటీవల స్వల్పంగా
By తోట వంశీ కుమార్ Published on 13 Sep 2021 2:07 AM GMTకరోనా సెకండ్ వేవ్ అనంతరం పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇటీవల స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. సోమవారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్‌లో రూ.46,070గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,070 గా ఉంది
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,390, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,440, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,990, 24 క్యారెట్ల ధర రూ.47,990
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.