శుభవార్త.. తగ్గుతున్న బంగారం ధరలు
September 12th Gold Price.భారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. అందుకనే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2021 7:46 AM ISTభారతీయులకు పసిడి అంటే మక్కువ ఎక్కువ. అందుకనే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతుంటారు. ఆర్థిక అవసరాల్లో బంగారం ఉపయోగపడినంతంగా మరేది అక్కరకు రాదు అనేది అందుకు కారణం. ఇక గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఆదివారం దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.