స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌తో అత్యధికంగా 7.6 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోంది. సేవింగ్స్ ఖాతాలతో పోల్చితే ఇందులో అధిక వడ్డీ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరేందుకు 2024 మార్చి 31 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ స్కీమ్ మరిన్ని వివరాలకు తర్వాత పేజీలోకి వెళ్లండి.
అధిక వడ్డీ రేటు
అమృత కలశ్ స్కీమ్ టెన్యూర్ 400 రోజులు ఉంటుంది. 2023 ఏప్రిల్ నుంచి ఈ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లో సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించేలా స్పెషల్ టర్మ్ డిపాజిట్లు ఉంటాయి. లేదా టెన్యూర్ పూర్తైన తర్వాత వడ్డీ ఖాతాలోనే జమ చేయించుకోవచ్చు.
ముందే నిర్ణయించుకోండి..
ఈ స్కీమ్‌లో పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ, 400 రోజుల టెన్యూర్ పూర్తి కాకుండా ముందుగానే డబ్బును ఉపసంహరించుకుంటే.. వడ్డీ రేట 0.5 శాతం నుంచి 1 శాతం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టే ఈ స్కీమ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు ఎంత డబ్బు పెట్టాలో ముందే నిర్ణయించుకోండి.