ఈ ఖతాదారులకు రూ.2లక్షల వరకు ఉచిత బీమా
SBI Offers Rs 2 Lakh Free Insurance Cover.2014లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం వల్ల ఎన్నో
By తోట వంశీ కుమార్
2014లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎస్‌బీఐ( స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) జన్‌ధన్ ఖాతాదారులకు రూ.2లక్షల వరకు ఉచిత బీమా అందిస్తోంది. రూపే కార్డు వాడే ఖాతాదారులకు కాంప్లిమెంటరీ సర్వీస్ కింద ప్రమాద బీమాతో పాటు ఇతరత్రా ఆఫర్లు అందిస్తోంది. ఈ బీమా క్లెయిమ్ అవసరం అయిన వారు తమ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అందించాలని ఎస్‌బీఐ పేర్కొంది.
జన్ ధన్ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి..
ఇప్పటివరకు మీరు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మీ సమీప బ్యాంకుకు వెళ్లి జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి నమోదు చేయాల్సి ఉంటుంది. ఏమైనా అనుమానాలు ఉంటే బ్యాంకు సిబ్బందిని అడిగినా చెబుతారు. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సహ కేవైసీకి సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అలాగే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఈ ఖాతా ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్ చేయవచ్చు. జన్‌ధన్ ఖాతాలపై జారీ చేసిన రూపే కార్డులకు ప్రమాద బీమా రూ. 2 లక్షల వరకు లభిస్తుంది. ఈ ప్రమాద బీమా పొందే సమయంలో అవరమైన డాక్యుమెంట్లు సమర్పించినట్లుతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని నామినీగా ఉన్న వ్యక్తికి అందించబడుతుంది.
క్లెయిమ్ చేయడానికి కావాల్సిన పత్రాలు
1) క్లెయిమ్ చేసుకునే పత్రంపై సంతకం
2) మరణ ధృవీకరణ ప్రతం
3) ప్రమాదం గురించి వివరణ ఇచ్చే పోలీసు స్టేషన్ యొక్క ఎఫ్‌ఐఆర్ కాపీ.
4) మరణం తర్వాత పోస్టుమార్టం నివేదిక పత్రం
5) కార్డుదారుని నామినీగా ఉన్న వ్యక్తి ఆధార్ కాపీ
6) జన్‌ధన్ కార్డు జారీ చేసిన బ్యాంకు నుంచి అధికారికంగా సంతకం చేసిన పత్రం. కస్టమర్‌కు జారీ చేసిన రూపే కార్డు నెంబర్ తప్పనిసరి. నామినీ పేరుపై ఉన్న బ్యాంకింగ్ వివరాలు.
పత్రాలు సమర్పించిన తేదీ నుంచి పది పని దినాలలో క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్చి 31,2022 వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు.