రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్‌.. వడ్డీ రేట్ల పెంపు

Sbi Hikes Interest Rate On Housing Loans. దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) రుణ గ్రహీతలకు బిగ్‌

By అంజి  Published on  16 Feb 2023 7:41 AM IST
రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్‌.. వడ్డీ రేట్ల పెంపు

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) రుణ గ్రహీతలకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ని 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఎస్‌బీఐలో హోమ్‌, వెహికల్‌, పర్సనల్‌ లోన్లపై వడ్డీరేటు మరింత అధికం అవుతుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటును ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారం రోజుల తర్వాత ఎస్‌బీఐ వడ్డీరేట్లను పెంచింది. ఒక్కరోజు లోన్లపై ఎంసీఎల్‌ఆర్‌ రేటు 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో లోన్‌ రేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెరిగింది. అలాగే నెల, మూడు, ఆరు నెలలు, ఏడాది, రెండేళ్ల రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్‌ పాయింట్లకు సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి.

ఇదిలా ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన ఎంసీఎల్‌ఆర్‌ని 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ నెల 7 నుంచే పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తన రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు(ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ని 25 బేసిస్‌ పాయింట్లు సవరించింది. దీంతో రేటు 8.75 శాతం నుంచి 9 శాతానికి చేరుకున్నది. సవరించిన రేట్లు ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఎంసీఎల్‌ఆర్‌ని 5 బేసిస్‌ పాయింట్లు సవరించింది. ఈ రేట్లు ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చాయి.

Next Story