దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను లాంచ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎస్‌బీఐ పాట్రన్స్ ఎఫ్‌డీ అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
80 సంవత్సరాల నిండిన సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు కొత్త డిపాజిటర్లు సైతం ఈ స్కీమ్‌లో చేరవచ్చు. సీనియర్ సిటిజన్లకు అందిస్తోన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లపై మరో 10 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ దీని కింద లభిస్తుంది. అంటే సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేసే రేటుపై అదనంగా 0.1 శాతం వడ్డీ ఇవ్వనుంది. ఇందులో రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.3 కోట్ల వరకు పొదుపు చేయవచ్చు. 10 సంవత్సరాల వరకు కాల వ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు.