ఎస్‌బీఐ అల‌ర్ట్.. ఆన్‌లైన్ సేవ‌ల‌కు అంత‌రాయం

SBI digital banking services will be suspended for two hours.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 11:57 AM IST
ఎస్‌బీఐ అల‌ర్ట్.. ఆన్‌లైన్ సేవ‌ల‌కు అంత‌రాయం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ బ్యాంకు ఆన్‌లైన్ సేవ‌లు కొన్ని గంట‌ల పాటు నిలిచిపోనున్నాయి. ఈ విష‌యాన్ని ఎస్‌బీఐ ట్వీట‌ర్ ద్వారా వినియోగ‌దారుల‌కు తెలియ‌జేసింది. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలుగనుందని వెల్ల‌డించింది.

ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యుపిఐ నిలిపివేయబడనున్నాయి. " ఈరోజు (జూలై 16న) రాత్రి 10.45 గంట‌ల నుంచి జులై 17న 1.15 గంటల వ‌ర‌కు అంటే.. రెండున్న‌ర గంట‌ల పాటు సేవ‌లకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. ఆ స‌మ‌యంలో మెయింటెనెన్స్‌ను చేప‌ట్ట‌బోతున్నామ‌ని ఎస్.బి.ఐ. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఆ స‌మ‌యంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ / యోనో / యోనో లైట్ / యుపిఐ అందుబాటులో ఉండదు. అసౌకర్యానికి చింతిస్తున్నామని.. దయచేసి క్షమించాలని" ఎస్.బి.ఐ. సంస్థ కోరింది.

ఆ స‌మ‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎటువంటి మెసేజులు,అల‌ర్ట్‌పై క్లిక్ చేయొద్ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ఆ స‌మ‌యంలో హ్యాక‌ర్లు మోసాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. క‌స్ట‌మ‌ర్లంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

Next Story