ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ముంచుకొస్తున్న గ‌డువు

SBI Customers Must Link PAN With Aadhaar Card by March 31.దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 23 Feb 2022 3:40 PM IST

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ముంచుకొస్తున్న గ‌డువు

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) త‌మ ఖాతాదారుల‌కు మ‌రోసారి అలెర్ట్ జారీ చేసింది. ఖాతాదారుల బ్యాకింగ్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఉండేందుకు పాన్ నంబ‌ర్‌ను ఆధార్‌తో అనుసంధానించాల‌ని కోరింది. మార్చి 31 వ‌ర‌కు ఆధార్‌తో పాన్ లింక్‌కు చివ‌రి తేదీ అని. ఆ నాటికి లింకు చేయ‌డంలో విప‌లం అయితే.. స‌ద‌రు ఖాతాదారులు ఎటువంటి లావాదేవీల‌ను నిర్వ‌హించుకోలేరంటూ హెచ్చ‌రించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్‌కు పాన్‌ నంబర్‌ను లింక్ చేయాలని సూచించింది. ఈ మేర‌కు త‌మ ట్విట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

పాన్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో ఇలా లింక్ చేయండి

- తొలుత www.incometax.gov.in ని ఓపెన్ చేయాలి

- 'క్విక్ లింక్స్' హెడ్ కింద 'లింక్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి

- కొత్త పేజీలో పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి

- ఇప్పుడు లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ నమోదు చేసి లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరిస్తే సరిపోతుంది.

మెసేజ్‌తో కూడా లింక్ చేయ‌వ‌చ్చు..

మొబైల్ ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ పంపి కూడా మీ పాన్ నెంబ‌ర్‌ను ఆధార్‌తో లింక్ చేయ‌వ‌చ్చు. ఉదాహరణకు.. మీ ఆధార్ నంబర్ XXXXXXXX4589 – PAN XXXXXX879Q అయితే. అప్పుడు మీరు UIDPAN XXXXXXXX4589 XXXXXX879Q అని టైప్ చేసి 567678 లేదా 56161కి ఎస్ఎంఎస్ పంపాలి.

Next Story