స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలపై వినియోగదారులను అలర్ట్ చేసింది. జూన్ 17 రెండు గంటల పాటు ఆన్‌లైన్ సర్వీసులు పనిచేయవని చెప్పింది. యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) సర్వీసులు పనిచేయవని చెప్పింది. అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు సర్వీసులు నిలిచిపోనున్నాయని ట్వీట్ చేసింది.
'మెయింటనెన్స్ కార్యకలాపాల నిమిత్తం రేపు (జూన్ 17, గురువారం) అర్థరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రెండు గంటల పాటు ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ లాంటి సేవలు అందుబాటులో ఉండవనీ, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలపై అప్రత్తమంగా ఉండాలని' ఖాతాదారులకు సూచించింది.
జూన్ 13న కూడా ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. బ్యాంకు సర్వీసుల్లో INB, YONO, YONO Lite, UPI సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. మెయింట్ నెన్స్ యాక్టివిటీస్ కోసం మే 21-23 వరకు కొన్ని గంటల పాటు కూడా ఆన్ లైన్ సర్వీసులను నిలిపివేసింది ఎస్‌బీఐ.