ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్

SBI alert link pan aadhaar seamless banking services.స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో మీకు బ్యాంక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2021 11:55 AM IST
ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎస్‌బీఐ తన కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ పంపింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలని కోరింది. బ్యాంకు పనులను సజావుగా జరగాలంటే ఆధార్‌, పాన్‌ కార్డులను అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.

కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడగించిన విషయం తెలిసిందే. గతంలో ఈ గడువును మార్చి 30 నుంచి జూన్ 30 వరకు పొడగించారు. ఒకవేళ ఒక వ్యక్తి పాన్-ఆధార్ ని గడువు తేదీ నాటికి లింక్ చేయడంలో విఫలమైనట్లయితే.. అప్పుడు అతడు/ఆమె గరిష్టంగా రూ.1,000 జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం కొరకు మీరు www.incometax.gov.in ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి లింకు చేయాల్సి ఉంటుంది.

పాన్‌కార్డును ఆధార్‌తో ఇలా లింక్ చేయండి..?

- ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

- ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.

- ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ యూఐడీఏఐ(UIDAI) చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

- దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.

- అంతే మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

Next Story