క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌.. వాటిని వెంట‌నే డిలీట్ చేయండి

SBI alert for customers.బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా సెల్‌ఫోన్లలో దాచుకుంటే వెంటనే దానిని డిలీట్ చేయాలని సూచించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2021 4:16 AM GMT
SBI

ఇటీవ‌ల కాలంలో ఆన్‌లైన్‌ ‌మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. మీకు న‌గ‌దు వ‌స్తుంద‌నో, బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా.. మీ ఓటీపీ చెప్పాల‌నో ఎన్నో ర‌కాలుగా సైబ‌ర్ నేర‌గాళ్లు.. దోచుకునేందుకు యత్నిస్తున్నారు. వీరి మాటాలు న‌మ్మి కొంద‌రు మోస‌పోయిన ఘ‌ట‌న‌లు చూశాం. ఇక డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రుణం నుంచి సైబ‌ర్ మోసాలు ఎక్కువ అయ్యాయి. ఈ త‌రుణంలో రిజ‌ర్వు బ్యాంకు స‌హా అనేక బ్యాంకులు త‌మ ఖాతాదారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు డిజిట‌ల్ మోసాల‌పై హెచ్చ‌రిక‌లు చేస్తూనే ఉన్నాయి.

తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) త‌మ ఖాతాదారుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా సెల్‌ఫోన్లలో దాచుకుంటే వెంటనే దానిని డిలీట్ చేయాలని సూచించింది. ముఖ్యంగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్ సహా కీలక విషయాలు ఏవీ ఫోన్‌లో ఉండకుండా చూసుకోవాలని కోరింది. అవి కనుక ఫోన్‌లో ఉంటే మోసాల బారినపడడం ఖాయమని.. కాబట్టి అలాంటి సమాచారమేదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలని ఎస్‌బీఐ సూచించింది.


Next Story