భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసిన శాంసంగ్

భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్,నేడు తమ అత్యున్నత ప్రీమియం గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి జిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 May 2024 5:15 PM IST
భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జి ని విడుదల చేసిన శాంసంగ్

భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్,నేడు తమ అత్యున్నత ప్రీమియం గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్ 55 5జి జిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ ఎఫ్ 55 5జి యొక్క సొగసైన మరియు ఆకర్షణీయమైన సౌందర్యం తో పాటుగా ప్రీమియం వేగన్ లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్‌ దీనిని చూడగానే ఆకట్టుకునేలా మారుస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జితో, శాంసంగ్ ఎఫ్ -సిరీస్ పోర్ట్‌ఫోలియోలో మొట్టమొదటిసారిగా క్లాసీ వేగన్ లెదర్ డిజైన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి సూపర్ అమోలెడ్ + డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్, 45వాట్ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్, నాలుగు తరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు మరియు ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌ల వంటి ఈ విభాగపు అత్యుత్తమ ఫీచర్‌లతో ప్రత్యేకంగా నిలుస్తుంది, రాబోయే సంవత్సరాలకు సైతం వినియోగదారులు తాజా ఫీచర్‌లు మరియు మెరుగైన భద్రతను ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది.


“గెలాక్సీ ఎఫ్ 55 5జితో, శాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మొట్టమొదటిసారిగా జీను కుట్టు నమూనాతో క్లాసీ వేగన్ లెదర్ డిజైన్‌ను అందిస్తోంది. శాడిల్ స్టిచ్ నమూనా తో కూడిన క్లాసీ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ మరియు బంగారు రంగులో ఉన్న కెమెరా డెకో ప్రీమియం సౌందర్యాన్ని వెదజల్లుతుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి రెండు ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది. అవి - ఆప్రికాట్ క్రష్ & రైసిన్ బ్లాక్. అదనంగా, సూపర్ అమోలెడ్ + 120హెర్ట్జ్ డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, నాలుగు తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు మరియు నాక్స్ భద్రతతో కూడిన సాటిలేని వాగ్దానంతో కలిపి, దాని వినియోగదారులకు అత్యుత్తమమైన అనుభవాలను అందించడంలో శాంసంగ్ శ్రేష్ఠతకు ఉదాహరణగా నిలుస్తుంది” అని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎంఎక్స్ డివిజన్, శాంసంగ్ఇండియా, రాజు పుల్లన్ చెప్పారు.

సొగసైన వేగన్ లెదర్ డిజైన్

గెలాక్సీ ఎఫ్ 55 5జి ఈ సంవత్సరం తమ విభాగంలోని అతి సన్నటి వేగన్ లెదర్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచేలా తీర్చి దిద్దబడినది. చూడగానే ఆకట్టుకునేలా రూపొందించబడిన, గెలాక్సీ ఎఫ్ 55 5జి ఒక ప్రత్యేకమైన శాడిల్ స్టిచ్ నమూనాతో పరిపూర్ణతకు ప్రదర్శించేలా రూపొందించబడిన ఒక క్లాసీ వేగన్ లెదర్ ఫినిష్ ను కలిగి ఉంది. ఈ కెమెరా డెకో బంగారు రంగులో వస్తుంది మరియు ప్రీమియం సొగసును అందిస్తుంది. ఆప్రికాట్ క్రష్ మరియు రైసిన్ బ్లాక్ అనే రెండు ఆకట్టుకునే రంగుల అవకాశాలలో లభిస్తుంది, ఈ స్మార్ట్‌ఫోన్ బరువు కేవలం 180 గ్రాములు మరియు 7.8 మిమీ వెడల్పుతో సూపర్ సొగసైనదిగా కొలుస్తుంది, ఇది ఉపయోగించడానికి నమ్మశక్యం కాని సమర్థతను కలిగి ఉంటుంది.

అద్భుతమైన ప్రదర్శన

6.7” ఫుల్ హెచ్ డి + సూపర్ అమోలెడ్ + డిస్‌ప్లేను కలిగి ఉన్న గెలాక్సీ ఎఫ్ 55 5జి వినియోగదారులకు అద్భుతమైన విజువల్స్ మరియు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అతి పెద్ద డిస్‌ప్లే 1000 నిట్స్ హై బ్రైట్‌నెస్‌తో వస్తుంది మరియు విజన్ బూస్టర్ టెక్నాలజీ వినియోగదారులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా తమకు ఇష్టమైన కంటెంట్‌ను సౌకర్యవంతంగా ఆస్వాదించేలా చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సోషల్ మీడియా ఫీడ్ ద్వారా స్క్రోలింగ్‌ను సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జెన్ -జెడ్ మరియు మిలీనియల్ కస్టమర్‌లకు మరింత సౌకర్యంగా చేస్తుంది.

శక్తివంతమైన ప్రాసెసర్

గెలాక్సీ ఎఫ్ 55 5జి 4ఎన్ఎం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది వినియోగదారులను సౌకర్యవంతంగా పని చేయడానికి అనుమతిస్తుంది. 5జి యొక్క అత్యుత్తమ వేగం మరియు కనెక్టివిటీతో, వినియోగదారులు ఎక్కడికి వెళ్లినా పూర్తిగా కనెక్ట్ అయి ఉండగలరు, వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, సున్నితమైన స్ట్రీమింగ్ మరియు ఇబ్బందులు లేని బ్రౌజింగ్‌ను అనుభవిస్తారు. ప్రాసెసర్ అధిక-నాణ్యత ఆడియో మరియు విజువల్స్‌తో పాటు హై-స్పీడ్ కనెక్టివిటీతో స్విఫ్ట్ మొబైల్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

నైటోగ్రఫీ కెమెరా

గెలాక్సీ ఎఫ్ 55 5జి అధిక-రిజల్యూషన్ మరియు షేక్-ఫ్రీ వీడియోలు మరియు ఫోటోలను షూట్ చేయడానికి 50 ఎంపీ (ఓఐఎస్ ) నో షేక్ కెమెరాను కలిగి ఉంది, చేతి వణుకు లేదా ప్రమాదవశాత్తు వణుకు కారణంగా ఏర్పడే అస్పష్టమైన చిత్రాలను తొలగిస్తుంది. కెమెరా సెటప్‌లో 8ఎంపి అల్ట్రా-వైడ్ సెన్సార్ కూడా ఉంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి నైటోగ్రఫీ తో వస్తుంది, దీనిలో బిగ్ పిక్సెల్ టెక్నాలజీ వల్ల , వినియోగదారులు అద్భుతమైన రీటైల్ తక్కువ-కాంతి కలిగిన షాట్‌లు మరియు వీడియోలను క్యాప్చర్ చేయడానికి అనుమతిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి వివరణాత్మక, చక్కటి సెల్ఫీల కోసం 50ఎంపీ హై రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్

గెలాక్సీ ఎఫ్ 55 5జి లో 5000mAh బ్యాటరీ ఉంటుంది , ఇది బ్రౌజింగ్, గేమింగ్ మరియు ఎక్కువ సేపు సినిమాలు లేదా సిరీస్ లు చూడటం వంటి సుదీర్ఘ సెషన్‌లను అనుమతిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి వినియోగదారులు కు ఇబ్బంది లేకుండా ఉండడానికి, కనెక్ట్ అయ్యేందుకు, వినోదాత్మకంగా మరియు ఉత్పాదకంగా ఉండటానికి అనుమతిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 55 5జి 45వాట్ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇస్తుంది.

గెలాక్సీ అనుభవం

గెలాక్సీ ఎఫ్ 55 5జి తమ శ్రేణిలో అత్యుత్తమమైన, డిఫెన్స్ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీతో వస్తుంది, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో గోప్యత మరియు భద్రత విషయానికి వస్తే చింతించనవసరం లేకుండా ఉంటారు. శాంసంగ్ యొక్క అత్యంత వినూత్న భద్రతా లక్షణాలలో ఒకటి అయిన శాంసంగ్ నాక్స్ వాల్ట్ ను సైతం గెలాక్సీ ఎఫ్ 55 5జి కలిగి ఉంటుంది. ఈ హార్డ్‌వేర్ ఆధారిత భద్రతా వ్యవస్థ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ దాడుల నుండి సమగ్ర రక్షణను అందిస్తుంది.

వాయిస్ ఫోకస్ వంటి ఆవిష్కరణలతో వినియోగదారు అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి గెలాక్సీ ఎఫ్ 55 5జి తీర్చిదిద్దబడింది. ఇది అద్భుతమైన కాలింగ్ అనుభవం కోసం పరిసర శబ్దాన్ని తగ్గిస్తుంది. ఫైల్‌లు, ఫోటోలు మరియు డాక్యుమెంట్‌లను ఏదైనా ఇతర పరికరంతో తక్షణమే షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతించే క్విక్ షేర్ ఫీచర్ ప్రైవేట్‌గా మీ ల్యాప్‌టాప్ మరియు ట్యాబ్‌తో దేనికైనా సహా చాలా దూరంలో వున్నప్పటికీ షేర్ చేస్తుంది. అదనంగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 55 5జితో నాలుగు తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు ఐదు సంవత్సరాల భద్రతా నవీకరణలను అందించడం ద్వారా కస్టమర్ సంతృప్తికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది, వినియోగదారులు రాబోయే సంవత్సరాల్లో తాజా ఫీచర్లు మరియు మెరుగైన భద్రతను ఆస్వాదించగలరని నిర్ధారిస్తుంది.

మెమరీ వేరియంట్లు, ధర, లభ్యత

గెలాక్సీ ఎఫ్ 55 5జి ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ , Samsung.com మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో 3 స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Next Story