భారీగా పతనమవుతున్న భారత కరెన్సీ

Rupee falls sharply.భారత కరెన్సీ ఇప్పుడు అత్యంత దారుణ పతనాలను ఎదుర్కొంటోంది. ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 12:03 PM GMT
Rupees

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత కరెన్సీ ఇప్పుడు అత్యంత దారుణ పతనాలను ఎదుర్కొంటోంది. ఈ వారంలో డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం రూపాయితో డాలర్ విలువ 75కు పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి అది 76కు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మార్చి చివరి నాటికి 0.1 శాతమే పడిపోయిన రూపాయి విలువ ఏప్రిల్ లో ఇప్పటిదాకా 2.6 శాతం పతనమైంది. కరెంట్ ఖాతాల మిగులు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం, విదేశీ నిధులు భారీగా రావడం వంటి కారణాలతో గత మూడు నెలల్లో ఆసియాలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది.

పెరుగుతున్న నిత్యావసరాల ధరలూ కరెంట్ ఖాతాల్లో లోటుకు కారణమవుతాయని, దాని వల్ల రూపాయి మరింత బలహీన పడే ప్రమాదముందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశంలో డాలర్ నిల్వలు కరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావాన్ని అందరూ తక్కువ అంచనా వేస్తున్నారని.. ప్రస్తుతమున్న విదేశీ మారక నిల్వలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆ గడ్డు పరిస్థితులను అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి విలువను పెంచేందుకు ప్రస్తుతమున్న డాలర్లను ఆర్బీఐ అమ్మే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు.


Next Story