సూపర్ ఫీచర్లతో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్
Royal enfield super meteor 650 finally arrived. బైక్ లవర్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ లాంచ్ అయ్యింది. స్టయిలిష్ అండ్
By అంజి Published on 9 Nov 2022 1:08 PM ISTబైక్ లవర్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ లాంచ్ అయ్యింది. స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్‌ఫీల్డ్ నుండి మరో కొత్త బైక్ మార్కెట్‌లోకి వచ్చింది. సరికొత్త ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ 'సూపర్ మెటోర్ 650' బైక్‌ను ఎన్‌ఫీల్డ్ విపణిలోకి తీసుకొచ్చింది. త్వరలోనే భారత్‌లో కూడా ఈ బైక్‌లు సందడి చేయనున్నాయి. ఇటలీలోని మిలన్‌లో జరుగుతున్న 2022 EICMA షోలో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిరీస్‌లో భాగంగా ఈ కొత్త బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్‌తో రెండు వేరియంట్లలో ఉంది.
స్టాండర్డ్, టూరర్ అనే రెండు వేరియంట్‌లలో ఈ బైక్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఫస్ట్‌ది ఐదు రంగులలో, సెకండ్‌ది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్‌లో అదరగొడుతోంది. స్టాండర్డ్ సూపర్ మెటోర్ 650ని 'సోలో టూరర్' వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. 648 సీసీ ట్విన్ ఎయిర్/ ఆయిల్ కూల్డ్ ఇంజీన్‌ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్‌ఎంపీ వద్ద 47 హెచ్‌పీ పవర్‌ను, 5650 ఆర్‌ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ టియర్ డ్రాప్ ఆకారంలో ఉంటుంది. 15.7 లీటర్ల ఫ్యూయల్ నింపవచ్చు. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్ ఈ బైక్ వస్తోంది.
బార్ ఎండ్ మిర్రర్స్, ఫుట్‌పెగ్‌లు, ఎల్‌ఈడీ సూచికలు, మెషిన్డ్ వీల్స్, టూరింగ్ డ్యూయల్-సీట్, టూరింగ్ విండ్‌స్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్, లాంగ్‌హాల్ ప్యానియర్‌లు, టూరింగ్ హ్యాండిల్ బార్ మొదలైనవి ఉన్నాయి. ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్‌లో 300 డిస్క్‌తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో ఈ బైక్ ధర దాదాపు రూ. 3.4 లక్షలు ఉంటుందని అంచనా.