పెరగనున్న ఇళ్ల అమ్మకాల ధరలు: రిపోర్ట్

వడ్డీ రేట్లు, ప్రీమియమైజేషన్‌ తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని క్రిసిల్‌ నివేదిక తెలిపింది.

By అంజి
Published on : 9 July 2025 4:31 PM IST

Residential real estate, real estate, annual sales growth, FY27, Crisil

పెరగనున్న ఇళ్ల అమ్మకాల ధరలు

వడ్డీ రేట్లు, ప్రీమియమైజేషన్‌ తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి ఉండే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. ఇళ్ల అమ్మకాలు 10 నుంచి 12 శాతం పెరుగుతాయని అంచనా. దీని వల్ల అమ్మకాలతో పాటు స్థిరాస్తి రంగంలో డిమాండ్‌ 5 నుంచి 7 శాతం, ధరలు 4.6 శాతం పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది.

డిమాండ్‌తో పాటు నిర్మాణ వ్యయం పెరగడం ఇందుకు కారణం. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించే రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు కూడా ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా స్థిరమైన విక్రయాల్ని కొనసాగించగలుగుతారని క్రిసిల్‌ అభిప్రాయపడింది. దేశ వ్యాప్తంగా అమ్ముడవుతున్న ఇళ్లలో సుమారు 35 శాతం వాటా ఉన్న 75 ప్రధాన రియల్‌ ఎస్టేట్‌ సంస్థల పనితీరు, బ్యాలెన్స్‌ షీట్లు, రుణ చెల్లింపుల సామర్థ్యాలను క్రిసిల్‌ విశ్లేషించింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను ఏకంగా 100 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టడంతో హోంలోన్‌ వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తున్నాయి. ఈ రుణ వడ్డీ రేట్లు దిగిరావడం సహా ఇళ్ల ధరల్లో పెరుగుదల స్వల్పంగానే ఉండటం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు కలిసి రావొచ్చని క్రిసిల్‌ రిపోర్ట్‌ అంచనా వేసింది.

Next Story