శుభ‌వార్త‌.. త‌గ్గిన సిలిండ‌ర్ ధ‌ర

ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.92 త‌గ్గింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2023 2:17 AM GMT
LPG, Lpg Gas Cylinder Price

ప్ర‌తీకాత్మ‌క చిత్రంప్రతి నెల ఒక‌టో తేదీన పెట్రోలియం కంపెనీలు ఎల్‌పిజి, ఎటిఎఫ్, కిరోసిన్ ఆయిల్ మొదలైన వాటి ధరలను సమీక్షించి వాటి ధ‌ర‌ల్లో మార్పులు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల కూడా ధ‌ర‌ల‌ను స‌వ‌రించాయి. ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.92 త‌గ్గింది. అయితే.. గృహ వినియోగ‌దారులు వినియోగించే 14.2 కిలోల సిలిండ‌ర్ ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు.

19 కేజీల వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో రూ.2028, కోల్‌కతాలో రూ 2132, ముంబైలో రూ.1980, చెన్నై రూ.2192.50, హైద‌రాబాద్ రూ.2325 గా ఉన్నాయి.

గృహ వినియోగదారులు వినియోగించే 14.2కేజీల గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

శ్రీనగర్‌లో రూ.1,219, ఢిల్లీలో రూ. 1,103, పాట్నాలో రూ.1,202, అహ్మదాబాద్‌లో రూ. 1110, భోపాల్లో రూ. 1118.5, జైపూర్లో రూ. 1116.5, బెంగళూరులో రూ. 1115.5, ముంబైలో రూ.1112.5, రాంచీలో రూ.1160.5, లక్నోలో రూ. 1140.5, కోల్‌కతాలో రూ.1129, విశాఖపట్నంలో రూ.1111, చెన్నైలో రూ.1118.5గా ఉన్నాయి

Next Story