ఇండియన్స్‌కు శుభవార్త.. శ్రీలంకలో ఇక ఫోన్‌పే సేవలు..!
శ్రీలంక వెళ్లే భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్ అందింది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 11:20 AM ISTఇండియన్స్‌కు శుభవార్త.. శ్రీలంకలో ఇక ఫోన్‌పే సేవలు..!
భారత్‌లో కొంతకాలంగా కాంటాక్ట్ లెస్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంతో యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక.. మనీ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ మరింత సులువుగా మారిపోయింది. చిన్న దుకాణాదారుల నుంచి.. పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నింటిలో యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులో ఉంచారు. ఒక్కస్కాన్‌తో మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో డబ్బులు క్యారీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింపోయింది.
తాజాగా శ్రీలంక వెళ్లే భారత పర్యాటకులకు గుడ్‌న్యూస్ అందింది. శ్రీలంలో కూడా యూపీఐ పేమెంట్స్ ప్రారంభం కాబోతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీ సంస్థ ఫోన్‌పే శ్రీలంకలో సేవలను ప్రారంభించింది. లంకాపేతో కలిసి సేవలను అందించనున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. ఇకపై భారతీయులు ఫోన్‌పే యాప్‌తో లంకా పే క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పే చేయవచ్చని పేర్కొన్నారు. శ్రీలంక అంతటా యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీలంక టూర్‌కి వెళ్లే భారత్ పర్యాటకులు తమ వెంట క్యాష్‌ను పెట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండదు. కరెన్సీ మారం రేటును చూపుతూ.. మొత్తం భారత రూపాయిలో డెబిట్ అవుతుందని యూపీఐ తెలిపింది. పర్యాకుటకులకు సురక్షితమైన చెల్లింపులను అందిస్తామని ఫోన్‌పే ఇంటర్నేషనల్ పేమెంట్స్ సీఈవో రితేష్ పాయ్ వివరించారు.
లంకా పే సీఈవో చన్నా డి సిల్వా ఈ మేరకు మాట్లాడుతూ.. భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. చెల్లింపులను మరింత సులభతరం చేస్తున్నామని.. ఇది మొదటి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఫోన్‌పేతో కలిసి వారికి సేవలు అందిస్తుండటం.. సంతోషంగా ఉందన్నారు.