భారత్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. కొంత కాలం గ్యాప్ తర్వాత గత వారం నుంచి పెట్రోల్, డీజిల్‌పై వడ్డింపు మొదలైంది. ఇక ఈ రోజు కూడా పెట్రో ధరలను పెంచేశాయి ఆయిల్ సంస్థలు.. రోజువారీ సమీక్షలో భాగంగా సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 25పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 25 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఇంధన ధరలు కొత్త గరిష్ఠానికి చేరుకున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పెట్రో ధరలు 75 పైసలు పెరిగిపోయాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.95కి చేరగా.. డీజిల్ ధర రూ.75.13గా ఉంది. దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.92.43కి చేరింది. డీజిల్ ధర అత్యధికంగా భువనేశ్వర్‌లో రూ.81.90కు పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు
హైదరాబాద్ - పెట్రోల్ రూ.88.37 - డీజిల్ రూ.81.99
కోల్‌కతా - పెట్రోల్ రూ.86.39 - డీజిల్ రూ.78.72
ముంబై - పెట్రోల్ రూ.91.56 - డీజిల్ రూ.81.87
చెన్నై - పెట్రోల్ రూ.87.64 - డీజిల్ రూ.80.44
బెంగళూరు - పెట్రోల్ రూ.87.82 - డీజిల్ రూ.79.67
భువనేశ్వర్ - పెట్రోల్ రూ.85.66 - డీజిల్ రూ.81.90గా ఉన్నాయి.