దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు నడిపేందుకు కూడా మొగ్గు చూపడం లేదు. బస్సు ప్రయాణమే మేలని చాలా మంది భావిస్తున్నారు. అయితే మూడు నాలుగు రోజులుగా ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినా.. ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది.
తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.91.17 ఉండగా, డీజిల్ రూ.81.47 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.57 ఉండగా, డీజిల్ రూ.88.60 ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.93.11 ఉండగా, డీజిల్ ధర రూ.86.45 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.94.22 ఉండగా, డీజిల్ రూ. 86.37 ఉంది.
అలాగే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 ఉండగా, డీజిల్ ధర రూ. 88.86 వద్ద కొనసాగుతున్నాయి. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.37 ఉండగా, డీజిల్ ధర రూ. 88.45 గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో పెట్రోల్ ధర రూ.97.26 ఉండగా, డీజిల్ ధర రూ.90.79 ఉంది. విశాఖపట్నంలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.26 డీజిల్ రూ. 89.81