వాహనదారులకు శుభవార్త.. 35రోజుల తరువాత తగ్గిన పెట్రోల్ ధర
Petrol price Reduced after 35 days.ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న
By తోట వంశీ కుమార్ Published on 22 Aug 2021 4:13 AM GMT
ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలతో తమ వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. కాగా.. రాఖీ పౌర్ణమి వేళ దేశ ప్రజలకు కొద్దిగా ఊరట కలిగించే వార్త ఇది. పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించాయి. అదేవిధంగా డీజిల్‌పై 18 పైసలు కోతపెట్టాయి. చాలా కాలంగా స్థిరంగా ఉన్న ధరలు తగ్గడం విశేషం.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ ధర రూ.89.07
- ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్ 96.64
- చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్ 93.66,
- కోల్‌కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్ 92.13,
- బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్ 94.49
- హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.69, డీజిల్ రూ.97.15
- కరీంనగర్‌లో పెట్రోల్ రూ. 105.42, డీజిల్ రూ. 96.60
- విజయవాడలో పెట్రోల్ రూ. 107.65, డీజిల్ రూ. 98.63
- విశాఖపట్నంలో పెట్రోల్ రూ. 106.67, డీజిల్ రూ. 97.67
దేశంలో మే, జూన్ నెలల మధ్య ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఆ రెండు నెలల్లో 42 సార్లు అధికమయ్యాయి. మొత్తంగా లీటరు పెట్రోలుపై రూ.11.52 వినియోగదారులపై భారం మోపాయి.